రెవెన్యూ క్లినిక్‌లను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ క్లినిక్‌లను వినియోగించుకోవాలి

Mar 4 2026 7:43 AM | Updated on Mar 4 2026 7:43 AM

రెవెన్యూ క్లినిక్‌లను వినియోగించుకోవాలి ట్రాక్టర్‌–ఆటో ఢీ

కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

భీమవరం (ప్రకాశంచౌక్‌): రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతంగా నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ తో పాటు సమాంతరంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తామన్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా జిల్లాలో మొత్తం 420 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 97 దరఖాస్తులను పరిష్కరించామని 29 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 294 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. భీమవరం డివిజన్‌ ఏడు మండలాల్లో 168 దరఖాస్తులు అందగా వీటిలో 43 పరిష్కరించామని, 11 తిరస్కరించామని, ఇంకా 114 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. నరసాపురం డివిజన్‌ ఎనిమిది మండలాల్లో 169 దరఖాస్తులు అందగా 43 దరఖాస్తులను పరిష్కరించామని, 11 దరఖాస్తులను తిరస్కరించామని, ఇంకా 115 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం డివిజన్‌ లోని ఐదు మండలాల్లో 83 దరఖాస్తులు అందగా 11 దరఖాస్తుల పరిష్కరించామని, 7 దరఖాస్తును తిరస్కరించామని, 65 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు.

ఆరుగురికి గాయాలు

ముసునూరు: మండలంలోని వలసపల్లి, చెక్కపల్లి గ్రామాల మధ్య ట్రాక్టర్‌, ఆటో ఎదురెదురుగా ఢీ కొనడంతో ఏడుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలి చేయి పూర్తిగా తెగిపడిపోయింది. క్షతగాత్రులను 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన కొందరు మంగళవారం సాయంత్రం వలసపల్లిలో మిర్చి కోత పని నుంచి తిరిగి వస్తుండగా, గుడిపాడు శివార్లలో ఎదురుగా ట్రాక్టర్‌ రావడంతో పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో మొలుగుమాటి నాగమ్మ (60)చేయి పూర్తిగా తెగిపడిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement