ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సుబ్బమ్మదేవి హై స్కూల్‌లో ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల సంస్థ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతల గురించి వివరించారు. బయాలజీ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్ జిల్లా ఫోరం ఆవిర్భావం, ఫోరం చేస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు ధనుంజయ రావు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, జిల్లా సైన్స్ అధికారి ఎస్‌వీ సోమయాజులు, హెచ్‌ఎం కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.


