నూజివీడు: అధికార పార్టీ నాయకుడైతే చాలు...ఏమి చేసినా చట్టం చుట్టమవుతోంది. కోడిపందేలు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. నూజివీడు మండలం సిద్ధార్థనగర్‌లోని మామిడితోటలో మంగళవారం భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ నాయకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోడిపందేలను పోలీసులు వస్తారనే భయం లేకుండా యథేఛ్చగా నిర్వహించారు. ఈ పందేలకు నూజివీడు మండలంతో పాటు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేట తదితర ప్రాంతాల నుంచి సైతం పందెంరాయుళ్లు, జూదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కోడిపందేలను సంక్రాంతి కోడి పందేలను తలపించేలా పెద్ద ఎత్తున నిర్వహించడం గమనర్హం. కోడిపందేలు నిర్వహిస్తున్న ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే డీఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అత్యంత ధైర్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా నిర్వహించారంటే టీడీపీ నాయకులు ఎలాంటి భరోసా ఉందో అర్థమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దాదాపు 15 పందేలు పైగా వేయగా ఒక్కో పందేనికి భారీగా డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. నూజివీడు మండలంలోని అన్నిగ్రామాల నుంచి రెడ్డిగూడెం, రంగాపురం, నాగులూరు, అన్నేరావుపేట, కొత్తరెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి వందలాది ద్విచక్ర వాహనాలు వేసుకుని కోడిపందేలకు తరలివచ్చారు.
లోనా బైట నిర్వహణ
సిద్ధార్థనగర్ ప్రాంతంలో ఒక వైపు అటవీప్రాంతం, మరోవైపు మామిడి తోటలు ఉండటంతో ఈ ప్రాంతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూదాలు, కోడి పందేలు గుట్టుగా నిర్వహిస్తున్నారు. లోనా బైట(కోసు) అయితే యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే అసాంఘిక కార్య కలాపాలను నిలువరించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పట్టించుకోని పోలీసులు


