స్టేట్‌గేమ్స్‌ మీట్‌ క్యారమ్స్‌ పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌గేమ్స్‌ మీట్‌ క్యారమ్స్‌ పోటీల్లో ప్రతిభ

Mar 4 2026 7:43 AM | Updated on Mar 4 2026 7:43 AM

స్టేట్‌గేమ్స్‌ మీట్‌ క్యారమ్స్‌ పోటీల్లో ప్రతిభ జిల్లా ప్రొటెక్షన్‌ చైర్మన్‌గా డేవిడ్‌ రాజు కారు ఢీ కొని వ్యక్తి మృతి లడ్డూపై రాజకీయాలు ఆపాలి మావుళ్లమ్మ ఆలయం మూసివేత

భీమవరం: స్టేట్‌ గేమ్స్‌ మీట్‌ క్యారమ్‌ విభాగంలో పట్టణంలోని విష్ణు ఇంజనీరింగ్‌ కళాఽశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం విజేతలైన క్రీడాకారులను కళాశాలలో అభినందించి, వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 28న అమలాపురం మండలంలోని బట్లపాలెం బీవీసీ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన స్టేట్‌ మీట్‌ పోటీలు నిర్వహించారన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.వేణు, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎం.శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు.

పెనుగొండ: జాతీయ మానవ హక్కులు, యాంటీ క్రైం కౌన్సిల్‌ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా ప్రొటెక్షన్‌ చైర్మన్‌గా ఆచంటకు చెందిన పాస్టర్‌ గాదిరాజు తిమోతిరాజు నియమితులయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించి సమావేశంలో ఏపీ అధ్యక్షుడు ఆర్‌జే రాజు, జాతీయ ఉపాధ్యక్షుడు బిషప్‌ డాక్టర్‌ సీహెచ్‌ సాంసన్‌ పీటర్‌ తదితరుల చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నట్లు వివరించారు.

ముదినేపల్లి రూరల్‌: ఎదురుగా వస్తున్న మోటారుబైక్‌ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మరణించిన టన మండలంలోని పెయ్యేరు వైఎస్సార్‌కాలనీ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా పామర్రు మండలం రిమ్మనపూడికి చెందిన జువ్వనపూడి షడ్రక్‌(42) ద్విచక్ర వాహనంపై మండవల్లి మండలం కానుకొల్లు అత్తారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా వైఎస్సార్‌ కాలనీ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 ఆంబులెన్సులో చికిత్స నిమిత్తం గుడివాడ తరలించగా మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు తెలిపారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ టి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తణుకు అర్బన్‌: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయం వెంటాడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు లడ్డూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయని, వీటిని ఆపాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ కోరారు. తణుకు చిట్టూరి హెరిటేజ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా లక్షల మంది తెలుగువారు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, యుద్ధ ప్రభావం సౌదీ అరేబియా ఖతర్‌, దుబాయ్‌ తదితర గల్ఫ్‌ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తక్షణమే సొంత గడ్డకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో వైఆర్‌వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీమావుళ్లమ్మవారి దర్శనం నిలిపివేశారు. దేవస్థానంలో సంప్రదాయం ప్రకారం పౌర్ణమి నాడు నిర్వహించే చండీహోమాన్ని ఉదయం 6 గంటలకే నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవారికి నిత్య కై ంకర్యాలు నిర్వహించి, మూలవిరాట్‌ దర్శనాన్ని నిలుపుదల చేశామని ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. బుధవారం సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం యథావిధిగా అమ్మవారి దర్శనం ఉదయం 8 గంటలకు పునః ప్రారంభిస్తామని దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్దమహాలక్ష్మీ నగేష్‌, దేవస్థా నం చైర్మన్‌ బొండాడ నాగభూషణం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement