ఏపీఈ సెట్‌కు సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్ పరీక్ష మంగళవారం నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 10 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష జరుగనుంది. ఏలూరు సిద్థార్ధ క్వెస్ట్ సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఉదయం 180 మంది, మధ్యాహ్నం 141 మంది, సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 148 మంది, మధ్యాహ్నం 100 మంది, ఏలూరు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 100 మంది హాజరు కానున్నారు. భీమవరం డీఎన్నార్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 110 మంది, మధ్యాహ్నం 100 మంది, దంతులూరి నారాయణరాజు అటానమస్ కళాశాలలో ఉదయం 100 మంది మధ్యాహ్నం 100 మంది, విష్ణు కళాశాలలో ఉదయం 100 మంది, మధ్యాహ్నం 93 మంది హాజరు కానున్నారు. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఆఫ్ ఉమెన్స్‌లో ఉదయం 100 మంది, నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 150 మంది, మధ్యాహ్నం 98 మంది, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 230 మంది, మధ్యాహ్నం 150 మంది, శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్‌లో ఉదయం 225 మంది మధ్యాహ్నం 120 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.


