బీసీల ఆత్మ బంధువు జగన్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీల ఆత్మ బంధువు జగన్‌

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం రూరల్‌/ ధవళేశ్వరం: ఎప్పటికీ బీసీల ఆత్మ బంధువు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని బీసీ నేతలు ముక్తకంఠంతో చెప్పారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. దగా చేసిన వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీలు గర్జించారు. జనాభాలో సగం కంటే ఎక్కువగా బీసీలు ఉన్నప్పటికీ నేటికీ కులవృత్తిదారులుగానే చంద్రబాబు చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతీరావు ఫూలే ఆశయాలను ఆచరణలో అమలు చేసి బలహీన వర్గాలకు మేలు చేసింది దివంగత మహానేత వైఎస్సార్‌, ఆయన తనయుడు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. నా బీసీలు అని చెప్పే దమ్మున్న జగన్‌ మళ్లీ గెలిస్తేనే బీసీలకు మంచి రోజులొస్తాయని.. దీనికోసం అంతా ఐక్యంగా ముందుకు సాగుదామని ప్రతినబూనారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీల గర్జన సదస్సు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన కాతేరులో ఆదివారం జరిగింది. ముందుగా జ్యోతీరావు ఫూలే, దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్‌, బూడి ముత్యాలనాయుడు, విడదల రజని, జోగి రమేష్‌, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరును ఎండగట్టారు. తొలుత ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దివంగత కాకుమాను రాజశేఖర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్‌, గుడాల గోపి, వివిధ విభాగాల కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మామిడి శ్రీకాంత్‌, గుబ్బల తమ్మయ్య, సంకిస భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గుబ్బల తులసీకుమార్‌, చెల్లుబోయిన శ్రీనివాస్‌, ఒమ్మి రఘురామ్‌, పాటి శివకుమార్‌, వాసిరెడ్డి జమీల్‌, వివిధ జిల్లాల బీసీ సెల్‌ అధ్యక్షులు అల్లి రాజబాబు, మట్టపర్తి నాగేంద్ర, నెరుసు చిరంజీవులు, శివకుమార్‌ గౌడ్‌, చిప్పడ నరసింహారావు, మానికొండ వెంకటేశ్వరరావు, దార్ల పాపయ్య, కాకినాడ మాజీ మేయర్‌ పి.సరోజ, ఏఎంసీ మాజీ చైర్మన్లు, వైఎస్సార్‌ సీపీ బీసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు దివంగత కాకుమాను రాజశేఖర్‌ చిత్రపటానికి

నివాళులర్పిస్తున్న తమ్మినేని, బొత్స సత్యనారాయణ, వేణు, భరత్‌రామ్‌ తదితరులు

బీసీ గర్జనకు హాజరైన నేతలు

రిజర్వేషన్ల పేరిట డ్రామా..

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో 34 శాతం రిజర్వేషన్ల పేరిట డ్రామాకు చంద్రబాబు తెరతీశాడు. వాస్తవానికి బీసీలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి వెన్నుపోటు పార్టీ నాయకుడికి లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశమే ఉంటే పవన్‌ కళ్యాణ్‌ పక్కన కూర్చునే అర్హత ఉన్న ఒక్క బీసీ ఎమ్మెల్యే దొరకలేదా..? వైఎస్‌ జగన్‌ ముగ్గురు బీసీలను ఉప ముఖ్యమంత్రులను చేస్తే వెన్నుపోటు పార్టీ నాయకుడు ఒక్కరినీ డిప్యూటీ సీఎంను చేయలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని మోసం చేశారు. రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులే నష్టపోతున్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని కాలయాపన చేస్తున్నారు. బలహీనవర్గాల గొంతుకగా వైఎస్సార్‌ సీపీ పోరాడుతుంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కుతుంది.

– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

ఫ వైఎస్‌ జగన్‌తోనే బలహీన వర్గాల సంక్షేమం

ఫ చంద్రబాబు పాలనలో వెన్నుపోటు, దగా

ఫ ఎన్నికల వేళ ఓట్ల కోసం మళ్లీ ఎత్తుగడలు

ఫ రాజకీయ ప్రాతినిధ్యం

కల్పించడంలో చిన్నచూపు

ఫ రెండున్నరేళ్లలో బలహీన వర్గాలకు చేసిందేమీ లేదు

ఫ వెన్నుపోటు పార్టీ వంచనపై

బీసీ గర్జనలో వైఎస్సార్‌ సీపీ నేతలు

బీసీ గర్జనలో చేసిన తీర్మానాలు

ఫ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌

కల్పించేందుకు చట్టం చేయాలి.

ఫ తక్షణమే ఉప ముఖ్యమంత్రి

పదవి బీసీలకు ఇవ్వాలి.

ఫ ఆదరణ పథకం పేరుతో బడ్జెట్‌లలో

కేటాయించిన రూ.3 వేల కోట్లతో

తక్షణమే పనిముట్లు ఇవ్వాలి.

ఫ 50 సంవత్సరాలు నిండిన బీసీలకు రూ.4

వేల చొప్పున పింఛన్‌ మంజూరు చేయాలి.

ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

రూ.9 వేల కోట్లు విడుదల చేయాలి.

ఫ రైతులకు ఉచిత పంటల బీమా పథకం

అమలుకు చర్యలు తీసుకోవాలి.

ఫ 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు

నెలకు రూ.1,500 ఇస్తామన్న

హామీ వెంటనే ఆచరణలో పెట్టాలి.

ఫ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు

చేసి పేదల ఆరోగ్యానికి బాసటగా నిలవాలి.

ఫ బీసీ నేతలపై కేసులు, వేధింపులు

తక్షణమే ఆపాలి.

ఫ బీసీలకు 150 రోజుల పాటు

ఉపాధి హామీ పథకం అమలు చేయాలి.

ఫ చట్టసభల్లో రాజ్యాధికారం కోసం బీసీ

రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించేలా

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

ఫ బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం 3 లక్షల

అప్లికేషన్లు రాగా, వారికి తక్షణమే

రుణాలు మంజూరు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement