చంద్రబాబు పాలనలో కన్నీళ్లే | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో కన్నీళ్లే

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఓట్లు వేసిన బీసీలంతా చంద్రబాబు పాలనను చూసి కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు బీసీలంతా తమ సత్తా చాటాలి.

– నవుడు వెంకటరమణ,

రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఉప ముఖ్యమంత్రిగా

బీసీలు పనికిరారా!

కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. బీసీలు ఉప ముఖ్యమంత్రిగా పనికిరారా..??. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చంద్రబాబు జీఓ ఇచ్చారు. నాలుక గీసుకోవడానికి కూడా జీఓలు పనికిరావు. చంద్రబాబు బీసీలను వాడుకుంటున్నారు. బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మన ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఆ సెమీ ఫైనల్స్‌లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధిస్తేనే చంద్రబాబుకు బుద్ధి వస్తుంది.

– మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎంపీ,

వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి

డీఎస్సీ అక్రమాలపై

జైలుకెళ్లడం ఖాయం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో బీసీలకు నామినేటెడ్‌ పదవులతో పాటు సంక్షేమ పథకాలు అందించారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై చంద్రబాబు, లోకేశ్‌ జైలుకెళ్లడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల్లో చిన్నస్థాయి కులాలకు సైతం ప్రాధాన్యం కల్పించి వారిని రాజకీయంగా ప్రోత్సహించాలి. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు బీసీలంతా ఐక్యంగా కృషి చేయాలి.

– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ

రాజకీయ ప్రాధాన్యం కల్పించారు

గత ప్రభుత్వంలో శాలివాహన (కుమ్మరి) కులస్తులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారు. నా భార్య మోహినికి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు. ప్రతి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాలను వైఎస్సార్‌ సీపీ తరుఫున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.

– బొండాడ వెంకన్నబాబు, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, తూర్పుగోదావరి

50 ఏళ్లకే పింఛన్‌ ఏదీ?

అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానన్న చంద్రబాబు 27 నెలలు గడిచినా అందించడం లేదు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు 20 లక్షల మంది ఉన్నారు. వారికి వెన్నుపోటు పార్టీ న్యాయం చేయలేదు. 2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం.

– పాపయ్యచారి,

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement