గత ప్రభుత్వంలోనే నేతన్నకు మేలు | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వంలోనే నేతన్నకు మేలు

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే చేనేత కుటుంబాలకు మేలు జరిగింది. ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.24 వేలు అందజేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. బీసీలకు న్యాయం జరగాలంటే 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి.

– చందన నాగేశ్వర్‌,

ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌

నాడు మామకు.. నేడు బీసీలకు

బలహీన వర్గాలకు వైఎస్సార్‌ ఎంతో అండగా నిలిచారు. తూర్పు కాపులకు బీసీ సర్టిఫికెట్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లగానే పరిష్కరించారు. దేశంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరే. నాడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ఇప్పుడు బీసీలకు సైతం వెన్నుపోటు పొడిచారు.

– రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం

వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలి

వెన్నుపోటు పార్టీపై ఈ రెండున్నరేళ్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు నేతలంతా దిశానిర్దేశం చేయాలి. గతంతో పోల్చితే వైఎస్సార్‌ సీపీ ఓట్లు షేర్‌ శాతం గణనీయంగా పెరగడంతో విజయం తథ్యం. 139 బీసీ కులాల మధ్య సమన్వయం సాధించాలి. వైఎస్‌ జగన్‌ బీసీలకు చేసిన మేలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

– గూడూరు శ్రీనివాస్‌,

పార్లమెంటు కో ఆర్డినేటర్‌, రాజమహేంద్రవరం

అన్ని కులాలకూ సంక్షేమ పథకాలు

మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ పాలనలో మేలు జరిగింది. వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రూ.3 వేల కోట్లతో 11 హార్బర్ల నిర్మాణం ప్రారంభించారు. అన్ని కులాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారు. బీసీ సంఘాలను, నాయకులను చైతన్యపరిచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా కృషి చేయాలి.

–పొన్నాడ సతీష్‌, మాజీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం

వెన్నుపోటు పార్టీకి బుద్ధి చెప్పాలి

చంద్రబాబు అధికారంలోకి వచ్చి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. బీసీ రుణాలు మంజూరు చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అన్నివిధాలా మోసం చేశారు. వెన్నుపోటు పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయానికి ఐక్యంగా కృషి చేయాలి.

– ఆవాల లక్ష్మీనారాయణ, పెరిక సామాజికవర్గ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ

చరమగీతం పాడే సమయం వచ్చింది

రాష్ట్రంలో బీసీలకు మేలు జరిగేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే. గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. వెన్నుపోటు పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీలంతా చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గరపడింది.

– కొండపల్లి దుర్గారావు,

వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు, తూర్పు గోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement