రాజమహేంద్రవరం రూరల్: మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధి బుచ్చియ్య నగర్‌కు చెందిన భీశెట్టి సోమేశ్వరరావు (44) మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. తాపీమేస్త్రి అయిన సోమేశ్వరరావు తన బావతో కలిసి బుధవా రం మధ్యాహ్నం మోరంపూడి సెంటర్‌లోని ఓ షాపులో స్టీలు కొనుగోలు చేసి ఆటోలో పుణ్యక్షేత్రం పంపించారు. సోమేశ్వరరావు, అతడి బావ ఆ ఆటో వెనుకే వేర్వేరు మోటార్ సైకిళ్లపై బయలుదేరారు. శాటిలైట్‌సిటీ నుంచి పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో పరుపుల ఫ్యాక్టరీ సమీపంలో సోమేశ్వరరావు మోటార్ సైకిల్‌ను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడిపోయిన సోమేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో వీఎల్ పురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కేవీ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
సోమేశ్వరరావు (ఫైల్)


