ప్రియాంక మృతి కేసులో నిందితుల విచారణ | - | Sakshi
Sakshi News home page

ప్రియాంక మృతి కేసులో నిందితుల విచారణ

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంకను కారుతో ఢీకొట్టడం వెనుక మీరేనా, ఎవరైనా మీతో ఆ పని చేయించారా అని సూరరాపు ధస్వంత్‌, ఆండ్రు జోసఫ్‌ ఎడ్వర్డ్‌లను పోలీసులు ప్రశ్నించారు. డాక్టర్‌ ప్రియాంక మృతి కేసులో నిందితులైన వారిద్దరినీ బుధవారం రాజమహేంద్రవరం పోలీసులు ఒక్క రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి నిందితులిద్దరినీ జిల్లా పోలీసు కార్యాలయం పక్కనే ఉన్న బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కేసు ప్రత్యేక విచారణాధికారి మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ నిందితులను పలు ప్రశ్నలు అడిగారు. గతంలో అడిగిన ప్రశ్నలకు నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాటినే తిరిగి అడిగినట్లు సమాచారం. ప్రియాంకను హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టలేదని, ప్రసాదిత్యమాల్‌ నుంచి బయటకు వస్తూ కారుకు అడ్డుగా వచ్చిన సందర్భంలోనే ఢీకొట్టామని నిందితులు పాత మాటలనే పోలీసులకు వినిపించినట్లు సమాచారం. విచారణ అనంతరం సాయంత్రం 6.30 గంటలకు తిరిగి సెంట్రల్‌ జైలుకు అప్పగించారు.

ప్రాణాలు కాపాడిన తాటిచెట్టు

పెరవలి: ఓ వ్యాన్‌ అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న తాటిచెట్టును ఢీకొని ఆగిపోయింది. వివర్లాలోకి వెళితే.. జాతీయ రహదారిపై దొమ్మేరు నుంచి కొవ్వూరు వైపు వస్తున్న వ్యాన్‌ అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోని పంట బోదెలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పంట బోదెలోని తాటిచెట్టును ఢీకొని వ్యాన్‌ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే బోదెలోకి వ్యాన్‌ దూసుకుపోయి ఎక్కువ నష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement