పైప్‌లైన్ వేసేందుకు రోడ్లపై గునపం గుచ్చారు..
మొత్తం తవ్వేశారు.. చివరికి తూతూమంత్రంగా పూడ్చి ఉన్న రోడ్డును పాడుచేశారు. రాజమహేంద్రవరంలో అమృత్–2 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా పైపులైన్లు కొత్తగా వేస్తున్నారు. కోటిలింగాల పేట, లలితానగర్, విద్యానగర్, నారాయణపురం వాటర్ ట్యాంకుల నుంచి ఆనంద్ ఏజెన్సీ, జాంపేట, జెండా పంజా రోడ్డు, కందకం రోడ్డు మీదుగా పుష్కరాల రేవు మంచినీటి సరఫరా ట్యాంకుల వరకు పైప్‌లైన్ వేసినందుకు బాగున్న రోడ్లను గునపాలతో తవ్వారు. పైప్‌లైన్ వేసిన తర్వాత తారు, సిమెంట్ రోడ్లపై తవ్విన చోట మట్టితో పూడ్చారు. ఎగుడుదిగుడుగా ఉండడం, సరిగ్గా పూడ్చకపోవడంతో జనం నరకం చూస్తున్నారు.
– ఫొటోలు : ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్,
రాజమహేంద్రవరం


