వారాహి ఆలయ స్వాధీనం తగదు | - | Sakshi
Sakshi News home page

వారాహి ఆలయ స్వాధీనం తగదు

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కరప మండలం కొరుపల్లిలో చిక్కాల వీర వెంకట సత్యనారాయణ (దొరబాబు) సొంత నిధులతో నిర్మించిన కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం తగదని పేర్కొంటూ కాకినాడ సిటీ, రూరల్‌, పెదపూడి మండలాలకు చెందిన మహిళా భక్తులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఒక అన్య మతస్తుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం తగదని వారు నినాదాలు చేశారు. గత 26 ఏళ్లుగా దొరబాబు సొంత నిధులతో తన గ్రామంలో ఆలయాలు నిర్మించి, ఉత్సవాలు చేయడమే కాకుండా అన్న సమారాధనతో పాటు మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు అందించారని వారు గుర్తు చేశారు. అన్య మతస్తులు ఇచ్చిన ఫిర్యాదు వెనుక ఎవరున్నారో విచారణ చేసి, ఆలయాన్ని తిరిగి దొరబాబుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయంలో కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో పిఠాపురంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వద్దకు వెళ్లి, వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించారు. అయితే, వారి బస్సును పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా భక్తులు దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యను తెలియజేయడానికి దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు వద్దకు తాము వెళ్లగా ఆయన దురుసుగా సమాధానం ఇచ్చారని దొరబాబు, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement