చెవిలో పువ్వులతో వీఆర్‌ఏల నిరసన | - | Sakshi
Sakshi News home page

చెవిలో పువ్వులతో వీఆర్‌ఏల నిరసన

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

పెరవలి: తమ సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్‌ఏలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెరవలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఓల నిరసన సోమవారంతో 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కాకరపర్తి సత్తిపండు మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా రూ.10,500 వేతనంతో జీవనం సాగిస్తున్నామని, మార్కెట్‌లో ధరలు పెరిగిపోవడంతో ఆకలితో అలమటిస్తున్నామని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, తమకు న్యాయం జరగడం లేదని తెలిపారు. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. అర్హులైన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గంటి వెంకట దుర్గా రామకృష్ణ, చదలవాడ సురేఖ, కర్రి సుధాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement