సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

ధరల నియంత్రణలో విఫలం

గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచదార, బెల్లం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో కిలో ఎప్పుడూ రూ. 40 నుంచి రూ.45 మధ్యే ఉండేది. ప్రస్తుతం రూ.70 దాటిపోవడంతో తీపి పదార్థాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం.

–దాడి శివాజీ, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం

తినడానికీ భయపడే పరిస్థితి

ప్రస్తుతం బియ్యం, నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఏమీ కొనలేం, తినలేం అన్న పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తినడానికి భయపడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. పంచదార, బెల్లం ధరల పెరుగుదలతో టీ, కాఫీ కూడా తాగడానికి ఆలోచించాల్సి వస్తోంది.

–కె.దీప్తి, గృహిణి, కోరుకొండ

ధరలు తగ్గిస్తామని చెప్పి..

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో నెలకోసారి ధరలు పెరుగుతుంటే సామాన్యులు జీవించలేని పరిస్థితి వస్తోంది. ధరల నియంత్రణకు చర్యలు చేపడతామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ధరలను నియంత్రించలేక చేతులేత్తేశారు.

–వాడ్రేపు చంద్రశేఖర్‌, దుప్పలపూడి, అనపర్తి

ఏమీ కొనలేకపోతున్నాం

మాలాంటి సామాన్యులు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, నూనె, పంచదార, బెల్లం, కూరగాయలు.. ఇలా సామాన్యులకు అవసరమైన వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. ఏమీ కొనే పరిస్థితి లేదు. సామాన్యులు బతకడం కష్టంగా మారింది.

–కోనాల పద్మలత, పీరా రామచంద్రపురం, అనపర్తి

బెధరగొట్టేలా బడ్జెట్‌!

కుటుంబ బడ్జెట్‌ బెదరగొడుతోంది.. సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. పప్పులు, ఉప్పులు, గ్యాస్‌ బండలు, ఇతర నిత్యావసరాల ధరల మంట అంతకంతకూ పెరుగుతోంది. సగటు జీవికి ఆక్రందన మిగులుతోంది.. చంద్రబాబు సర్కారు తీరుతో ప్రతి కుటుంబం కడుపు నిండా తినడానికీ ఆలోచించాల్సి వస్తుంది. కూడబెట్టినదంతా ఖర్చులకే సరిపోతోంది. కూలి నాలీ చేసుకునే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ధరల మంటలు చల్లారేదెన్నడో అనే ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి ఉత్పన్నమవుతోంది.

సాక్షి, రాజమహేంద్రవరం/ ప్రకాశంనగర్‌/ కోరుకొండ/ అనపర్తి: సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంట ధరల మంట రేగింది. ఉప్పు నుంచి పప్పు వరకు, నూనెలు, బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్ని ధరలూ పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్‌ తారుమారవుతోంది. ఇప్పటికే విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, పెట్రోల్‌ ధరల పెరుగుదలకు నిత్యావసరాల ధరలూ తోడయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల నియంత్రణ లేకుండా పోయింది. అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఉద్దేశ పూర్వకంగానే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారని... వారిపై చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెనుకాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రెండు, మూడు నెలల క్రితం వరకు మేలు రకం సన్నబియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య లభించేవి. ప్రస్తుతం కొన్ని రకాల సన్న బియ్యం ధర రూ.70 దాటిపోయింది. అంటే కిలోపై సుమారు రూ.15 నుంచి రూ.20 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో నెలకు 25–30 కిలోల బియ్యం కొనుగోలు చేసే కుటుంబానికి రూ.500 వరకూ అదనపు ఖర్చు అవుతోంది. మరోవైపు మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మకై ్క ధరలు పెంచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం నిల్వలన్నీ గతేడాది సాగు చేసినవే. గత ఖరీఫ్‌, రబీలోనూ రికార్డు స్థాయిలో వరి సాగయ్యిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అయినప్పటికీ బియ్యం ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్‌ జోక్యం చేసుకోవడం లేదు.

ౖపైపెకి ఉల్లి.. వెల్లుల్లి

వంటింటి ఖర్చును ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా పెంచేస్తున్నాయి. ఇటీవల ఉల్లి ధర గణనీయంగా పెరిగింది. జూలైలో కిలో రూ.20–25 మధ్య ఉన్న ఉల్లి ప్రస్తుతం రైతుబజార్లలో రూ.50కు చేరిందని, బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి రూ.70కు పైగా విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు జిల్లాలోని రైతుబజార్లకు నాణ్యమైన ఉల్లి తీసుకురావడం లేదని ఆరోపిస్తున్నారు. కిలోలో 20 శాతం కుళ్లిన ఉల్లిపాయలే ఉంటున్నాయని... వాటిని తీసేసి నాణ్యమైనవి ఎంచుకునేందుకు కూడా వ్యాపారులు అవకాశమివ్వడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు.

● రెండు నెలల క్రితం కిలో వెల్లుల్లి సుమారు రూ.140 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.300కు చేరుకుంది. నాణ్యత, గ్రేడింగ్‌ ఆధారంగా కొన్ని దుకాణాల్లో రూ.300కు పైగా కూడా విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. అలాగే కిలో ఎండుమిర్చి ధర రూ.300కు చేరింది.

● వంట నూనెల ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బ్రాండెడ్‌ వంట నూనె కిలో రూ.160 నుంచి రూ.170 మధ్య లభించగా.. ప్రస్తుతం రూ.185 దాటేసింది. నూనె వినియోగం తగ్గించే అవకాశం లేకపోవడంతో ధర పెరుగుదల నేరుగా కుటుంబ బడ్జెట్‌పై పడుతోంది.

ఇంట కూర‘గాయాలే’

నిత్యావసరాల్లో కీలకమైన కూరగాయల ధరలూ భారంగా మారాయి. ముఖ్యంగా క్యారెట్‌, బీన్స్‌, గోరుచిక్కుడు వంటి కూరగాయల ధరలు గతంతో పోలిస్తే కిలోకు రూ.20కు పైగా పెరిగాయి. ఒక్కో కూరగాయపై చిన్న మొత్తంలో కనిపించే పెరుగుదల.. నెల మొత్తం లెక్కేస్తే రూ.వందల అదనపు ఖర్చు అవుతోంది. ఆదాయం పెరగకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో కుటుంబాలు తమ ఇతర ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిత్యావసరాల ధరల నియంత్రణపై చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.

వంటింట్లో ధరల మంట

హడలిపోతున్న పేద, మధ్యతరగతి వర్గాలు

కిలోకు రూ.20 మేర పెరిగిన సన్న బియ్యం

అదే బాటలో బెల్లం, పంచదార

కొండెక్కిన ఉల్లిపాయలు

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

పంచదార పరుగులు

గణపతి నవరాత్రి సంబరాలు జరుగుతుండడం, కొద్ది రోజుల్లో శరన్నవరాత్ర ఉత్సవాలు సమీపిస్తున్న వేళ పంచదార, బెల్లం ధరలు చేదెక్కాయి. రెండు నెలల క్రితం కిలో పంచదార రూ.40 నుంచి రూ.45 మధ్య ఉంటే... ప్రస్తుతం రూ.70 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని స్థానిక స్వీట్‌ షాపుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రేషన్‌ దుకాణాల్లో రాయితీపై అందించే పంచదారను డీలర్లే బొక్కేస్తున్నారనే విమర్శలున్నాయి. యంత్రంలో శబ్ధం రాకుండా సెట్టింగ్స్‌ మార్చేసి, వేలిముద్రలు తీసుకుని పంచదార ఇచ్చినట్లు నమోదు చేసేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బెల్లం ధర కూడా పెరిగింది. కొద్దిరోజుల క్రితం కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య ఉన్న బెల్లం ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. ప్యాకింగ్‌ చేసిన బెల్లం దిమ్మల ధరలు కొన్నిచోట్ల కిలో రూ.90కు విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement