బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

బహిరంగ క్షమాపణ చెప్పాలి

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులను మనోవేదనకు గురిచేసే విధంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు, పవన్‌ రాజకీయ స్వార్థంతోనే తప్పుడు ఆరోపణలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఆనవాళ్లే లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తులో వెల్లడైంది.

–టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ కన్వీనర్‌

దేవాలయాలపై రాజకీయం తగదు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూటమి నాయకులు పలు రాజకీయ విమర్శలు చేశారు. భక్తుల సెంటిమెంట్‌కు సంబంధించిన ఈ వ్యవహరంలో రాజకీయాలు చేయడం సరికాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని ఈడీ స్పష్టం చేసింది. దేవాలయాలు వేరు.. రాజకీయాలు వేరు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

–తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement