పోరాడేందుకు మళ్లీ అవకాశమివ్వండి | - | Sakshi
Sakshi News home page

పోరాడేందుకు మళ్లీ అవకాశమివ్వండి

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

అమలాపురం టౌన్‌: ఉపాధ్యాయ సమస్యలపై పోరాడేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి కోరారు. యూటీఎఫ్‌ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గోపిమూర్తి తనకు ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశమివ్వాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీఏఎస్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గోపిమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement