కన్యాకా పరమేశ్వరికి సోదరుడైన శ్రీపాదుడికి అమ్మవారు పౌర్ణమి నాడు స్వయంగా వచ్చి రాఖీ కట్టినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ రోజున అమ్మవారి తరఫున ఆలయ అర్చకులు, ముత్తైదువలు రాఖీ తెచ్చి సమర్పిస్తారు. అనంతరం భక్తులు రాఖీలు కట్టడం ప్రారంభిస్తారు. స్వామి వారి విగ్రహాలతో పాటు ఔదంబర వృక్షానికి సైతం వారు రాఖీలు కడుతుంటారు. ఆలయానికి వచ్చే పురుషులకు సైతం మరాఠీ మహిళలు స్వయంగా రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని వ్యక్తం చేస్తుంటారు.
– ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ అర్చకుడు, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం
తోబుట్టువుకు బహుమతిగా సారె
రాఖీ పౌర్ణమి రోజున కన్యాకాపరమేశ్వరి అమ్మవారు శ్రీపాదుడికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు అందజేసిన సందర్భంగా శ్రీపాదుడి తరఫున సంస్థానం నుంచి ఏటా అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీగా వస్తోంది. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తుల కంటే 90 శాతం మంది మరాఠీ భక్తులే ఇక్కడికి వచ్చి అన్ని సేవల్లోను పాల్గొంటారు. శ్రీపాదుడు 1320లో ఇక్కడ జన్మించినట్లు గురు చరిత్రలో చెప్పబడింది.
– ఆర్ సౌజన్య, ఈఓ, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం
●


