మహనీయుల ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయ సాధనకు కృషి

Aug 16 2026 12:27 AM | Updated on Aug 16 2026 12:27 AM

రాజమహేంద్రవరం రూరల్‌: స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకు వచ్చారన్నారు. ప్రజలకు వెన్నుదన్నుగా వైఎస్సార్‌ సీపీ ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల వీర్రాజు (బాబు), మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రాష్ట్ర మహిళా విభాగ అధికార ప్రతినిధి రుఖియా సయ్యద్‌, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ అధికార ప్రతినిధి ఎంఎం అలీ, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ్‌ కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీనివాస్‌, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి చాపారాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా కార్యదర్శులు యెనుముల త్యాగరాజు, ముద్దాల అను, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు చీకురుమిల్లి చిన్న, చెరుకూరి సత్యనారాయణ, షేక్‌ చానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement