వనమహోత్సవం
కంబాలచెరువు: స్థానిక జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆధ్వర్యంలో శనివారం వన మహోత్సవం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నగరంలోని న్యాయమూర్తులంతా పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంతో పాటు న్యాయమూర్తుల నివాస భవనాల వద్ద మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎస్.సుజాత, బి.నిర్మల, జి.షణ్ముఖరావు, ఎస్.ఉమాసునంద, వెంకటేశ్వరరావు, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు బి.పద్మ, కె.ప్రకాష్‌బాబు, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


