ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కారాగార, దిద్దుబాటు సేవల రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్‌కు ‘కరెక్షనల్ సర్వీసెస్‌లో విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకం’ లభించింది. ఈ సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది, సహచరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఖైదీల పునరావాసం, దిద్దుబాటు కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో సేవలు, కారాగార పరిపాలనలో నిబద్ధతతో పనిచేసినందుకు ఈ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పతకాలను ప్రదానం చేస్తుంది. ఎస్.రాహుల్‌కు లభించిన ఈ గౌరవం స్థానిక సెంట్రల్ జైలుకు, జిల్లా ప్రజలకు గర్వకారణమని అధికారులు తెలిపారు.
çÜÐ]l¬-{§ýl…-ÌZMìS 1.47 ÌS„ýSÌS ˘
క్యూసెక్కుల మిగులు జలాలు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,47,180 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద శుక్రవారం సాయంత్రం 10.90 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.09 మీటర్లు, పేరూరులో 9.44 మీటర్లు, దుమ్ముగూడెంలో 7.05 మీటర్లు, భద్రాచలంలో 20.80 అడుగులు, కూనవరంలో 9.07మీటర్లు,కుంటలో 4.85 మీటర్లు, పోలవరంలో 6.25 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.04 మీటర్ల వద్ద నీటి మట్టాలు ఉన్నాయి.
స్టైపెండ్ పెంచాల్సిందే
కొనసాగుతున్న జూడాల సమ్మె
సాక్షి, రాజమహేంద్రవరం: స్టైపెండ్ పెంపుతో పాటు డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు చేపట్టిన సమ్మె శుక్రవారం కూడా కొనసాగింది. ఉదయం స్థానిక జీజీహెచ్ నుంచి వై.జంక్షన్ వరకు వారు ర్యాలీ నిర్వహించారు. ప్రతి రెండేళ్లకు స్టైపెండ్ పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదని, నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాల్లో ఎన్‌ఎంసీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రస్తుతం నాన్ ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే బహిష్కరిస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరో వైపు వైద్యుల సమ్మెతో వార్డుల నిర్వహణ, శస్త్ర చికిత్సలు, పరీక్షల నిర్వహణపై ప్రభావం పడుతోంది.


