● పుష్కర ఘాట్ నుంచి
అమ్మవారి ఊరేగింపు
సీటీఆర్‌ఐ: నగరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వద్ద ఉన్న కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో బుధవారం లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశ పూర్వక సహస్ర ఘటాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢ అమావాస్యను పురస్కరించుకుని పుష్కర ఘాట్ నుంచి ఉలూక (గుడ్లగూబ) వాహనంపై అమ్మవారిని కోలాటం, కేరళ చెండై వాయిద్యాలు, సన్నాయి మేళంతో 1008 మంది సువాసినులు కలశాలతో గోదావరి నీటిని తీసుకువచ్చారు. మరోవైపు ఏకాదశ పూర్వక సహస్ర ఘటాభిషేకాన్ని 108 మంది రుత్వికులు జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


