సాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ 2025 స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాల్సిందేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పేరిట 421 మందిని ఎంపిక చేసేశారన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని కోరుతూ ఇన్‌చార్జి డీఆర్‌వో భాస్కరరెడ్డికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులతో కలిసి ఆయన శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఇష్టారాజ్యంగా జీవోలు
మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇష్టారాజ్యంగా జీవోలు మార్చేశారని ఆరోపించారు. కనీసం డిగ్రీ లేకున్నా, టెట్‌లో అర్హత సాధించకున్నా కేవలం శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం దారుణమన్నారు. అంతులేని అక్రమాలతో కూడిన డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆధారాలు చూపించినా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చేసుకోవడం సిగ్గు చేటన్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ప్రశ్నపత్రాల తయారీలో పారదర్శకతకు పాతరేశారని, ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియను ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో పెట్టి పేపర్ లీకేజీకి కారణమవడతో ఆ వ్యవస్థలో పనిచేసిన నవీన్‌కే టాప్ ర్యాంకులొచ్చాయన్నారు.
జీవోలతో మాయాజాలం
ఫ గతంలో ఉన్న జీవో 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండేదని, ఇతర అభ్యర్థులతో పరీక్ష రాయడం తప్పనిసరనే నిబంధన ఉండేదని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ మాత్రం డీఎస్సీ 2025లో జీవో నెంబర్ 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మినహాయించేసి కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచేసిందన్నారు. నియామకాలు పూర్తి కాగానే ఆ జీవోలను రద్దు చేస్తూ, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ మరో జీవో నంబర్ 56 జారీ చేశారని మండిపడ్డారు. తమ వారికి ఉద్యోగాలిచ్చేసుకుని జీవోలు మార్చేశారన్నారు.
ఫ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కన పెట్టి, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపించారు.
ఫ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారిలో 38 మందికి, లోకేశ్ తోడల్లుడు, ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన 39 మందికి ఉద్యోగాలిచ్చేశారన్నారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడిని పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకొచ్చాయన్నారు. ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వ్యక్తి ఓ అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపినా ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొనడం దారుణమన్నారు.
ఫ నామమాత్రపు కేసు నమోదు చేసి వదిలేయడం, ఈ కుంభకోణం వెనుక పెద్దలున్నారనే విషయాన్ని రుజువు చేస్తోందన్నారు.
ఫ విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు కలిసి రూ.9,500 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, నాగులాపల్లి ధనలక్ష్మి, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దూలం వెంకన్న బాబు, కర్రి పాపారాయుడు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
·˘ yîlGïÜÞ °Ä¶æ*-Ð]l$-M>ÌZÏ A{MýS-Ð]l*-ÌSMýS$
మంత్రి లోకేశ్‌దే బాధ్యత
·˘ Ð]l$…{† ç³§ýl-ÑMìS Æ>i-¯éÐ]l* ^ólĶæ*Í
·˘ OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$
వేణుగోపాలకృష్ణ డిమాండ్
·˘ ´ëÈt Mø BÇz¯ól-rÆý‡$Ï, ¯éĶæ$MýS$ÌS™ø
కలిసి ఇన్‌చార్జి డీఆర్‌వోకి
వినతిపత్రం అందజేత


