హత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

హత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

రాజమహేంద్రవరం సిటీ: ఇన్నీసుపేటలో ఈ నెల 28న జరిగిన పోలమాంబ అమ్మవారి జాత ర సందర్భంగా దారుణ హత్యకు గురైన యర్రా గణేష్‌ అలియాస్‌ గంజి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం యర్రా గణేష్‌ కుటుంబ సభ్యులు, స్థానికులతో నగరంలోని వైఎస్సార్‌ సీపీ సిటీ కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ను కలిశారు. మృతుడి భార్య రమాదేవి తన భర్తను పాలా చంద్రశేఖర్‌ అలియాస్‌ చంటి మరొక ఇద్దరు కలిసి హత్య చేశా రని పోలీసులు చెబుతున్నారని కానీ వారితో పాటు ఇంకా చాలామంది ఉన్నట్టు తమకు అనుమానం ఉందని వివరించారు. నిందితులు ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడంతో పోలీసులు ఈ కేసును అక్కడితో ముగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన భరత్‌రామ్‌ వెంటనే ఈ విషయాన్ని ఏలూరు రేంజ్‌ డీఐజీ దృష్టికి ఫోన్‌ ద్వారా తీసుకుని వెళ్లి కేసు వివరాలను తెలిపారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన డీజీపీ..ఎస్పీని కలవాల్సిందిగా సూచించారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.

నేడు మెగా జాబ్‌ మేళా

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం హోటల్‌ మంజీరా సరోవర్‌లో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ తెలిపారు. మేళా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ, నాన్‌ ఐటీ, ఫైనాన్స్‌, ఫార్మా, నర్సింగ్‌, హాస్పటల్స్‌, మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌, ఈ–కామర్స్‌, రిటైల్‌, ప్రొడక్షన్‌, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ రంగాలకు చెందిన 70 కంపెనీలు సుమారు రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాయన్నారు. ఎంపికై న వారికి స్పాట్‌లోనే లెటర్‌ అందజేస్తారని, జాబ్‌ మేళా హెల్ప్‌ డెస్క్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు.

కట్నం వేధింపులపై కేసు

అనపర్తి: కట్నం కోసం వివాహితను వేధిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి.రవిచంద్ర కుమార్‌ శుక్రవారం తెలిపారు. బిక్కవోలు మండలం కాపవరానికి చెందిన డి.నాగలక్ష్మికి సీతానగరం మండలం ఇనగంటివారిపేటకు చెందిన డి.వినోద్‌ కుమార్‌తో 2021లో వివాహమైంది. ఆ సమయంలో నాగలక్ష్మి తల్లిదండ్రులు రూ.9 లక్షలు ఇచ్చారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వినోద్‌కుమార్‌ మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరంగా వేధిస్తున్నా డు. పెద్దలు సర్దిచెప్పినా అతడి ప్రవర్తన మార లేదు. ఈ నేపథ్యంలో జూలై 15న నాగలక్ష్మిని పుట్టింటికి పంపి రూ.7 లక్షలు అదనంగా తీసుకువస్తేనే రావాలని కోరాడు. దీంతో నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement