చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
యానాం: స్థానిక కనకాలపేటకు చెందిన కాలా సుబ్రహ్మణ్యం(40) ఈ నెల 23న విద్యుత్ షాక్‌కు గురికాగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టురు వద్ద పనిచేసే అతను విద్యుత్ స్తంభం మారుస్తున్న సందర్భంలో షాక్‌కు గురయ్యాడు. మృతుడు కొన్నేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్ కొప్పాడి వెంకటేశ్వరరావు వద్ద పనిచేస్తున్నాడు. గోపాల్‌నగర్ శివారున ఉన్న అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరో చోటుకు మారుస్తుండగా స్తంభం ఎక్కిన సుబ్రహ్మణ్యం హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో గాయపడ్డాడు. కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశాలు ఉండేవని ఐదురోజుల పాటు జీజీహెచ్‌లోనే ఉంచారని స్థానికులు అంటున్నారు. మృతుడుకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలైన కుమారై, కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో తమకు ఆధారం లేకుండాపోయిందని విద్యుత్‌శాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని మృతిని భార్య నాగమణి కోరారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే అనుమతులు లేకుండా చేసిన పని వల్ల ప్రమాదానికి గురై కార్మికుడు బలైపోయాడని స్థానికులు పేర్కొన్నారు.
పట్టించుకోని విద్యుత్ శాఖ, కాంట్రాక్టరు


