టెన్షన్.. టెన్షన్..
19ఆర్‌జేసి09:
19ఆర్‌జేసి208:
19ఆర్‌జేసి14:
ఫాస్టర్ ప్రవీణ్ మృతిచెందిన స్థలం వద్ద నివాళులర్పిస్తున్నక్రైస్తవులు,వివిధసంఘాలు నేతలు
ఇంటి వద్ద మాజీ ఎంపీ
హర్షకుమార్
నక్కా వెంకటరత్నాన్ని అరెస్టు చేస్తున్న
దృశ్యం
● పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత
● నివాళులర్పించేందుకు వచ్చిన
మాజీ ఎంపీ హర్హకుమార్
● ఆయనను జీపులో తరలించిన పోలీసులు
● భారీగా తరలివచ్చిన క్రైస్తవ సంఘాలు
రాజమహేంద్రవరం రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపున్విడంతో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రవీణ్ మృతి చెందిన స్థలానికి హర్షకుమార్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఆయనను వెంటనే జీపులో ఎక్కించుకుని పలు స్టేషన్లకు తరలించారు. ఈ లోగా భారీ సంఖ్యలో వివిధ సంఘాల నేతలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ప్రవీణ్ మృతి చెందిన స్థలం దగ్గరకు చేరుకున్నారు. వారికి అక్కడకు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానీ క్రైస్తవ సంఘాల నాయకులు వాటిని తోసుకుని వెళ్లి ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి, సుమారు గంట పాటు ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది ముమ్మాటికే హత్యేనని, ప్రస్తుత పాలకులు, పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈలోపు బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు, మాలమహానాడు నాయకుడు నక్కా వెంకటరత్నం, ఆర్‌పీఐ నాయకుడు జంగం సుబ్బారావు, నిడదవోలుకు చెందిన రమేష్‌ను పోలీసులు జీపుల్లోకి ఎక్కించుకుని రాజానగరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో రాత్రి 7.30 గంటల వరకూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హర్షకుమార్‌ను సుమారు ఐదు గంటల పాటు విఽవిధ స్టేషన్లకు తిప్పి రాత్రి 7.30 గంటలకు ఇంటి వద్ద వదిలిపెట్టి, భారీ ఎత్తున పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
జగన్ ప్రభుత్వం ఎంతో బెటర్:
హర్హకుమార్
ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కన్నా జగన్ పాలన ఎంతో బాగుండేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఐదు గంటల పాటు తనను పోలీస్ జీపులో తిప్పుతూ ఇబ్బంది పెట్టారన్నారు. పోలీసులు తనను తీసుకువెళ్లినా కార్యక్రమం విజయవంతమైందన్నారు.
టెన్షన్.. టెన్షన్..


