గోపాలపురం: సంక్రాంతి సందర్భంగా మండలంలోని వేళ్లచింతలగూడెంలో నిర్వహించే టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఘంటా రంగారావు మధుకృష్ణ ఫౌండేషన్ సంస్థ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా ఈ గ్రామంలో నిర్వహించే క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతిగా రూ.లక్షా 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.30 వేలుగా అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ దరఖాస్తులను ఈనెల 5వ తేదీ లోగా అర్ అండ్‌ఎం ఫౌండేషన్ సభ్యులకు అందజేయాలన్నారు. ఎంట్రీ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గత క్రీడాకారులు 9494943434 నంబరులో సంప్రదించాలని సూచించారు.