అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలి

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

అమలాపురం రూరల్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జరిగింది. డీఆర్‌వో సుబ్బారావు, కొత్తపేట, అమలాపురం ఆర్డీవోలు జీవీవీ సత్యనారాయణ, సరళావతి తదితరులతో కలిసి మొత్తం 214 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించారు. భూ రికార్డు ఆన్‌లైన్‌లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పూడికతీత, ఇంటి స్థలం, ఇళ్లు, పింఛను, సదరం సర్టిఫికెట్‌, రహదారుల సమస్య వంటి అంశాలపై అర్జీలు అందాయి. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని డీఆర్వో ఆదేశించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 36 అర్జీలు ˘

అమలాపురం టౌన్‌: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 అర్జీలు వచ్చాయి. జిల్లా ఏఎస్పీ మహేంద్ర మత్తే నిర్వహించిన ఈ పోలీస్‌ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదునూ జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఏఎస్పీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఆస్తి తగదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే కావడంతో ఆ అర్జీదారులకు ఏఎస్పీ మహేంద్ర కౌన్సెలింగ్‌ చేసి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.

జిల్లా రెవెన్యూ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement