పెట్టే చేతిని ఎవరూ దూరం చేసుకోరు. మనుషుల గురించి పక్కన పెడితే శునకాలు, పక్షులు, గోవులు ఇలా కొన్ని జాతులకు ఒకే సమయంలో రెండు మూడు రోజుల పాటు ఏ తిండి గింజలో పెడితే అదే సమయానికి ఆ గుమ్మం ముందుకొచ్చి ఆర్తితో చూస్తుంటాయి. ఇదిగో మండలంలోని ఇందుపల్లిలో మండల పీఎంపీ, అర్‌ఎంపీ వైద్యసంఘం అధ్యక్షుడు కుడుపూడి రమణ ఇంటి ముంగిట చిత్రమిది. పదేళ్లుగా ఆ తల్లులు పెట్టే ఆహార పానీయాలకు అలవాటు పడిన చిలుకలు ఆ ఇంటితో అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. వాటి కోసం ఆ ఇంటి వారు ఏకంగా బియ్యం తొట్టేలు ఏర్పాటు చేసి 10 కేజీల బియ్యం, తాగునీరు పెడుతున్నారు. ఇక్కడి రామచిలుకల సందడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వాటితో పాటే ఉడుతలు, గోరింకలు, వడ్రంగి పిట్టలు వంటి పక్షిజాతులు ఇక్కడి తిండి గింజలు, నీటిని ఆరగిస్తుండడం స్థానికులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
అమలాపురం రూరల్


