రేడియాలజీ పరిభాషపై సదస్సు | - | Sakshi
Sakshi News home page

రేడియాలజీ పరిభాషపై సదస్సు

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

అమలాపురం టౌన్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ ఫిజీషియన్స్‌ (ఐఐహెచ్‌పీ) కోనసీమ యూనిట్‌ ఆధ్వర్యంలో స్థానిక దొమ్మేటివారి వీధిలో ఆదివారం రెడియాలజీపై అవగాహన సదస్సు జరిగింది. ‘అండర్‌ స్టాడింగ్‌ ఆఫ్‌ టెర్మినాలజీ ఇన్‌ రెడియాలజీ’ అనే అంశంపై కోనసీమ హోమియో వైద్యులు చర్చించారు. నవంబర్‌ 21, 22వ తేదీల్లో హైదరాబాద్‌ కన్హా శాంతి వనంలో జరగనున్న అంతర్జాతీయ హోమియోపతిక్‌ కాన్‌క్లేవ్‌–2026 పోస్టర్లను వైద్యులు విడుదల చేశారు. హైదరాబాద్‌ డాక్టర్‌ యల్లారెడ్డి రెడియాలజీ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యల్లా సంధ్యారత్నం ముఖ్య అతిథిగా పాల్గొని సెషన్‌ నిర్వహించారు. రెడియాలజీ రిపోర్టుల్లోని వైద్య పరిభాషను ఎలా అర్ధం చేసుకోవాలన్న అంశాలపై వారు అవగాహన కల్పించారు. సదస్సులో కోనసీమ హోమియో వైద్య ప్రముఖులు బీఎస్‌ మోహన్‌, జీవీఎస్‌ శర్మ, ఎన్‌.శ్రీనివాస్‌, బాలరాజు, దయానిధి, గణేశ్వరరావు, రమ్య తదితరులతో పాటు హోమియో వైద్య విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు.

తిరుపతికి

క్రీడాకారుల పయనం

అమలాపురం రూరల్‌: జిల్లా స్థాయిలో నిర్వహించిన అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న 320 క్రీడాకారులు ఆదివారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో తిరుపతికి వెళ్లారు. డీఎస్‌ఓ వైవీ రుద్ర అధ్వర్యంలో కోచ్‌లు, మేనేజర్లతో కలసి వారు బస్సుల్లో తరలి వెళ్లారు. వారు వెళ్తున్న బస్సును ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ఒ.ఈశ్వరరావు, బాస్కెట్‌ బాల్‌ కోచ్‌ ఎ.సూర్యకుమారి, తైక్వాండో కోచ్‌ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు కె.గణేష్‌, రామారావు పాల్గొన్నారు.

భీమేశ్వరుని దర్శించిన హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌

రామచంద్రపురం రూరల్‌: అలహాబాద్‌ హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ అభినేష్‌ చద్దా దంపతులు ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు వారికి స్వాగతం పలికారు. భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement