అయినవిల్లిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అయినవిల్లిలో భక్తుల సందడి

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి నివేదన చేశారు. స్వామికి 38 జంటలు లఘున్యాస అభిషేకాలు జరిపారు. ఏడు జంటలు గరిక పూజ జరిపారు. 27 మంది భక్త దంపతులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. ఆరుగురికి అన్నప్రాశన చేశారు. ఏడుగురికి తులాభారం సమర్పించారు. 22 మందికి అక్షరాభ్యాసం చేశారు. 69 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. 2415 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు రూ.3,23,462 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

గంగాధర్‌కు

పీహెచ్‌డీ ప్రదానం

కాట్రేనికోన: గ్రామానికి చెందిన మట్టపూర్తి గంగాధర్‌ ఈనెల 22న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతిలో నిర్వహించిన 8వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ అందుకున్నారు. గంగాధర్‌ తండ్రి రమేష్‌ నీటిపారుదల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గాను, తల్లి వాణి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈ మేరకు గంగాధర్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement