యువతకు స్వయం ఉపాధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువతకు స్వయం ఉపాధే లక్ష్యం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన 19వ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలితో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్వాయర్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ పంచాయతీరాజ్‌ విభాగాల సమన్వ యంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విస్తరాకుల తయారీకి ప్రోత్సాహం పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వక్క అరటి ఆకులతో విస్తరాకుల తయారీ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. సముద్రపు నాచు పెంపకం ప్రాసెసింగ్‌కు 200 మందిని ఎంపిక చేయాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించారు.

నిబద్ధతతో మూల్యాంకనం చేయాలి

అమలాపురం టౌన్‌: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని మూల్యాంకన కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించి పలు సూచనలిచ్చారు. విద్యార్థి పదేళ్ల కష్టానికి, వారి భవిష్యత్‌ ఆశయాలకు ఈ మార్కులే పునాది అని చెప్పారు. మార్కులను ట్యాబ్‌లలో ఎక్కిస్తున్న ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. డీఈవో పి.నాగేశ్వరరావు మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్‌కు వివరించారు.

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement