మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి
రాజోలు: మహిళలను కించపరిస్తే సహించమని రాజోలు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి అన్నారు. మహిళలను అవమానిస్తూ ఏబీఎన్ చానల్‌లో కథనం ప్రసారం చేసిన ఎండీ రాధాకృష్ణపై ఆమె రాజోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.వి.నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రాజోలు సర్కిల్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలను అవమానించిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరిదేవి మాట్లాడుతూ బాధ్యత గల మీడియాలో ఉంటూ మహిళలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ప్రసారాలు చేయడం దారుణమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ తన చానల్ ద్వారా మహిళాలోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖరరావు, బొలిశెట్టి భగవాన్, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజా, రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గుబ్బల మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గుబ్బల రమేష్ పాల్గొన్నారు.


