అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన జగడం విజయలక్ష్మిని కేసీఎం అధి కారుల చొరవతో సురక్షితంగా కోనసీమకు చేర్చారు. గతంలో రెండుసార్లు కువైట్‌లో పనిచేసిన ఆమె సన్నవిల్లి గ్రామానికి చెందిన మొల్లి సత్యనారాయణ అనే ఏజెంట్ 2025 నవంబర్ 15న ఖతార్ వెళ్లింది. అక్కడ వెంకీ అనే ఏజెంట్ ఒక ఇంట్లో పనికి పెట్టాడు. రెండు నెలలు పనిచేసి జీతం తీసుకుంది. తదుపరి ఆరోగ్యం క్షీణించడంతో కుడి చేయి వాచిపోయి పని చేయలేని స్థితికి చేరుకుంది. ఆ యించి యజమాని వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఏజెంట్‌తో మాట్లాడగా ఆయన రూ.లక్ష కడితే గాని పంపే ప్రసక్తి లేదని చెప్పగా వెంటనే రూ.లక్ష అప్పు చేసి ఇచ్చింది. నెల రోజులు దాటుతున్నా అతడు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఆ బృందం సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి విజయలక్ష్మిని సురక్షితంగా తీసుకువచ్చినట్టు కేంద్ర సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తెలిపారు.


