
సమర్థంగా వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం
– కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశం
అమలాపురం రూరల్: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన మాట్లాడుతూ చాలామంది వృద్ధులు తమ పిల్లల నిరాదరణకు గురై ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరితనంతో ఎన్నో అవమానాలను భరిస్తున్నారన్నారు. ఈ చట్టం అమలుకు వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలన్నారు. 60 సంవ త్సరాలు దాటిన వారి భద్రత కోసం ఈ చట్టం రూపొందించారని తెలిపారు. సెక్షన్ 19 ప్రకారం ప్రతి జిల్లాకు ఒక వృద్ధా శ్రమాన్ని ప్రభుత్వ పరంగా నెలకొల్పాలని, కనీసం 150 మంది వృద్ధులు, నిరాదరణ గురైన తల్లిదండ్రులు ఆశ్రయం కల్పించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజనుల సంక్షేమ అధికారి శ్రీనివాసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ధరల నియంత్రణలో పర్యవేక్షణ కమిటీ కీలకం
జిల్లాలో ధరల పర్యవేక్షణ కమిటీ నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించి, నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్, కమిటీ చైర్మన్ టీ నిషాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ పనితీరుపై ఆమె కమిటీ సభ్యులతో సమీక్షించారు. బియ్యం, పప్పులు, చక్కెర, నూనె ధరలు నియంత్రణలో ఉండేటట్లు పర్యవేక్షించాలన్నారు. కమిటీ కన్వీనర్, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, మా ర్కెట్ కమిటీ ఏడి కే. విశాలాక్షి, తూనికలు కొలతల నియంత్రణ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.