
5న అక్రిడిటేషన్ల కోసం నిరసనలు
అమలాపురం టౌన్: జిల్లాలోని నియోజకవర్గాల స్థాయిలో పాత్రికేయులు ఆగస్టు 5న సమావేశమై అక్రిడిటేషన్ల మంజూరు కోసం నిరసనలు తెలిపాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ సమావేశం నిర్ణయించింది. అలాగే అదే రోజు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్వీ ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశం జరిగింది. జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి ముగ్గురు సభ్యులను నామిటేడ్ చేయాల్సి ఉన్న దృష్ట్యా సమావేశం ఆ ఎంపికపై చర్చించింది. ఆగస్టు 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు సమావేశం తీర్మానం చేసింది. యూనియన్ జిల్లా కార్యదర్శి కాటే భీమ శంకరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్, ఉమ్మడి జిల్లా యూనియన్ మాజీ కార్యదర్శి సుంకర ప్రసాద్ మాట్లాడారు.
అనుబంధ కమిటీల
అధ్యక్షుల నియామకం
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. వీరిద్దరూ మండపేట నియోజకవర్గానికి చెందిన వారే. పార్టీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా మరిశెట్టి సత్యనారాయణ, పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా టపా గోవిందరావు నియమితులయ్యారు.
నేడు సత్యదేవుని
హుండీల లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీలను బుధవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.