
శాంతించిన గోదారమ్మ
ఐ.పోలవరం: గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం స్వల్పంగా పెరిగిన వరద తొమ్మిది గంటల సమయం నుంచి నెమ్మదిగా తగ్గుతోంది. ఉదయం ఆరు గంటల సమయంలో బ్యారేజీ వద్ద 6,00,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఏడు గంటలకు 6,40,120 క్యూసెక్కులకు పెరిగింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో 6,37,240 క్యూసెక్కులకు, మధ్యాహ్నం ఒంటి గంటకు 6,09,540 క్యూసెక్కులకు, రెండు గంటలకు 6,00,100 క్యూసెక్కులకు తగ్గింది. సాయంత్రం ఆరు గంటలకు 6,00,100 క్యూసెక్కుల వద్ద వరద తగ్గింది. ఎగువ ప్రాంతాలలో వరద తగ్గడం వల్ల ఇది మరింత తగ్గుతోందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో గోదావరికి రెండవసారి వచ్చిన వరద కూడా తొలి ప్రమాద హెచ్చరిక వరకు వెళ్లకుండా తగ్గడం పట్ల లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

శాంతించిన గోదారమ్మ