
లోవోల్టేజీ సమస్య లేకుండా చర్యలు
అమలాపురం రూరల్: జిల్లాలో లోవోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో ఏపీఈపీడీసీఎల్ ఇంజినీర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ తీర ప్రాంతం వెంబడి లోవోల్టేజీ, విద్యుత్ కోత సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వినియోగదారుల కోసం ప్రత్యేక విభాగం ద్వారా విద్యుత్ సరఫరా, ఆక్వా కమర్షియల్‌కు రంగాలకు ప్రత్యేక సెక్షన్లుగా విభజించుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని, పవర్ డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ లైన్లను నవీకరించాలన్నారు. ఆగస్టు నెలాఖరుకు విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు యూనిట్లకు ఏర్పాట్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజేశ్వరి, ఈఈలు రాంబాబు, రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.