
బీబీ సకీనాకు కన్నీటి నివాళి
అమలాపురం టౌన్: మహ్మద్ ప్రవక్త మనమరాలు బీబీ సకీనా వర్ధంతిని గొల్లగూడెంలోని బీబీ సకీనా పీర్ల పంజా వద్ద బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు నల్లటి దుస్తులు ధరించి గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరంతో పాటు కోనసీమ జిల్లా నుంచి షియా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ప్రదేశ్ నుంచి విచ్చేసిన మత గురువు మౌలానా సయ్యద్ తాహిర్ అబెది మషేద్ది ముస్లింలనుద్దేశించి మత బోధనలు చేశారు. బీబీ సకీనా జీవిత చరిత్రను వివరించారు. చిన్నారి సకీనా సిరియా దేశంలోని బందిఖానాలో పడిన పాట్లు, బలైన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. మాతంలో కొందరు రక్తం చిందేలా గుండెలు బాదుకున్నారు.