కూల్‌ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి.. ఆమె పడుకోగానే.. | Youth Theft Gold Chain For Old Women Nizamabad | Sakshi
Sakshi News home page

కూల్‌ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి.. ఆమె పడుకోగానే..

Jun 6 2022 11:07 AM | Updated on Jun 6 2022 11:36 AM

Youth Theft Gold Chain For Old Women Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,మాచారెడ్డి(నిజామాబాద్‌): ఓ వృద్ధురాలికి కూల్‌ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చుక్కాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుక లక్ష్మి కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆమె ఇంటి పక్కన ఉండే రాములు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి తాగించాడు.

ఆమె నిద్రపోగానే మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఉదయం లేచిన లక్ష్మి మెడలో గొలుసు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!

Advertisement
 
Advertisement
Advertisement