అక్క కోసం కదులుతున్న బస్సు దిగుతూ.. | Young Woman Died In Road Accident | Sakshi
Sakshi News home page

అక్క కోసం కదులుతున్న బస్సు దిగుతూ..

Published Sat, Jun 15 2024 7:47 AM | Last Updated on Sat, Jun 15 2024 7:47 AM

Young Woman Died In Road Accident

బస్సు కింద పడి యువతి దుర్మరణం

యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వద్ద దుర్ఘటన  

వెంగళరావునగర్‌: అక్క కోసం కదులుతున్న బస్సు దిగిన చెల్లెలు ప్రమాదవశాత్తూ అదే బస్సు చక్రాల కింద నలికి మృత్యువాత పడిన ఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మసీరా మెహ్రీన్‌(16) యూసుఫ్‌గూడలోని మాస్టర్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా, ఆమె సోదరి జవేరియా మెహెక్‌ సెకండియర్‌ చదువుతోంది. 

మధ్యాహ్నం కళాశాల అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి అక్కాచెల్లెళ్ళు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి బోరబండ వెళ్తున్న బస్సు రాగానే రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా మెహ్రీన్‌ బస్సు ఎక్కింది. మెహెక్‌ మాత్రం ఫుట్‌ బోర్డు వరకు ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో బస్సు ఎక్కలేక రోడ్డు మీదనే నిలబడిపోయింది. 

ఇంతలో బస్సు బయలుదేరడంతో అక్క కోసం మెహ్రీన్‌ కదులుతున్న బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయతి్నంచింది. దాంతో ఆమె ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి నలిగి మృతి చెందింది. అక్క మెహెక్‌తో పాటు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సైతం విలవిలలాడిపోయారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న మెహ్రీన్‌ వారం కిందటే కాలేజీలో చేరింది. మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement