హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్‌పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెట్టును ఢీ కొట్టిన కారు
శామీర్‌పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్‌కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది.
ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్‌తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment