ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం | Young Boy Molested On Young Lady At Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం

Oct 17 2020 6:35 AM | Updated on Oct 17 2020 6:49 AM

Young Boy Molested On Young Lady At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పేరుతో యువతికి మాయమాటలు చెప్పిన ఓ యువకుడు బలవంతంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌యాదవ్‌ తెలిపిన మేరకు.. న్యూబోయిగూడకు చెందిన ఓ యువతి కుటుంబం మూడేళ్ల క్రితం యాప్రాల్‌ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆసమయంలో ఇంటి పక్కన ఉండే రవి అనే వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందిన డ్రైవర్‌ గడ్డం మహేష్‌ (27)ను పరిచయం చేశాడు. యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించిన మహేష్‌ గత ఏడాది నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ తరచుగా ఫోన్‌లో మాట్లాడేవాడు.

కొద్ది నెలల నుంచి తనను ప్రేమించాలని మహేష్‌ వేధిస్తున్నాడు. జూలైలో మహేష్‌ ఆ యువతి పనిచేస్తున్న షాపు వద్దకు వచ్చి జూపార్కుకు వెళదామంటూ తన ద్విచక్రవాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 7గంటల సమయంలో ఎల్‌బీనగర్‌లోని అటవీ ప్రాంతంలో లైంగికదాడి చేశాడు. అలాగే ఈనెల 12వ తేదీన పెళ్లి గురించి మాట్లాడాలంటూ తీసుకెళ్లి మరోసారి అఘాయిత్యం చేసి మరుసటిరోజు ఉదయం 7గంటల సమయంలో ఆ యువతిని బోయిగూడలోని పెట్రోల్‌ బంకు వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చాక జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పడంతో ఆమె గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   (ఫార్మసిస్ట్‌ ఆత్మహత్య.. సింహాద్రి బాలుపై ఆరోపణ)

Advertisement
 
Advertisement
Advertisement