పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో | Woman Last Breath After Man Duped Her With Love At Khammam | Sakshi
Sakshi News home page

పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో

Mar 12 2021 12:08 PM | Updated on Mar 12 2021 12:24 PM

Woman Last Breath After Man Duped Her With Love At Khammam - Sakshi

ఈమెకు ఖమ్మం చర్చి కౌంపౌండ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కర్రి సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. సంజయ్‌కు అంతకు ముందే వివాహం కాగా ఆ విషయాన్ని దాచిపెట్టి రత్నకుమారిని ప్రేమించాడు.

సుజాతనగర్/ఖమ్మం‌: ప్రేమపేరుతో మోసపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎం.శ్రీనివాస్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని మాలబంజర గ్రామానికి చెందిన తంబర్ల రత్నకుమారి (24) ఖమ్మంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఈమెకు ఖమ్మం చర్చి కౌంపౌండ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కర్రి సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. సంజయ్‌కు అంతకు ముందే వివాహం కాగా ఆ విషయాన్ని దాచిపెట్టి రత్నకుమారిని ప్రేమించాడు.

పెళ్లైన విషయం తెలిసి ఆ యువతి మనస్తాపం చెంది ఈ నెల 9న స్వగ్రామానికి వచ్చి, మరుసటి రోజు పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం మృతి చెందింది. మృతురాలి బాబాయి తంబళ్ల స్వామిదాసు ఫిర్యాదు మేరకు సంజయ్, బెదిరింపులకు పాల్పడ్డ అతని బావమరిది కొత్తగూడేనికి చెందిన చిన్నపాక కరుణ ప్రకాశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 
(చదవండి: భర్త హత్య.. అతడి సాయంతోనే పూడ్చిపెట్టింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement