పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్‌ డే పార్టీ ఇస్తానని..

Woman killed in MMTS Train Accident at Khairatabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన పుట్టిన రోజున ఎంతో సంతోషంతో ఇంట్లో ముస్తాబై సెల్‌ఫోన్‌లో ఫొటో దిగింది. ఆఫీస్‌ నుంచి వచ్చిన తర్వాత తండ్రికి, తమ్ముడికి సాయంత్రం బర్త్‌ డే పార్టీ ఇస్తానని చెప్పింది. డ్యూటీకి వెళ్తున్నానంటూ చెప్పి బయల్దేరిన కొద్ది నిమిషాలకే ఆమెను మృత్యువు కబళించింది. ఎంఎంటీఎస్‌ రైలు వేగం ధాటికి ఎగిరికింద పడిన ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మహారాష్ట్ర షోలాపూర్‌నకు చెందిన లావణ్య తండ్రి, సోదరుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. తుమ్మలబస్తీలో ఉంటున్నారు. లావణ్య ఖైరతాబాద్‌లో టెలీకాలర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం తుమ్మల బస్తీ నుంచి ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పట్టాలు దాటి ఖైరతాబాద్‌కు వచ్చే క్రమంలో హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలు స్పీడ్‌కు ఒక్కసారిగా ఎగిరి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (భువనగిరిలో కిడ్నాప్‌.. సింగరాయకొండలో పట్టివేత)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top