మంచం కింద తల్లి అస్తిపంజరంతో..

Woman Kept Her Mother Skeleton Under The Cot In Mumbai - Sakshi

ముంబై : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మహిళ తన తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద దాచుకుని జీవిస్తున్న ఘటన ఆదివారం మహారాష్ట్రలోని ముంబైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై సమీపంలోని చూయిమ్‌ గ్రామానికి చెందిన మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఇంటి ముందు ఉన్న రోడ్డుపై చెత్త, ఇతర వ్యర్థాలు పడేసేది. ఆమె తీరుతో విసిగిపోయిన చుట్టుప్రక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో మంచం కింద  మనిషి శరీరం బెడ్‌షీట్‌లో కప్పబడినట్లుగా వారికి కనిపించింది. (దారుణం.. ఉద్యోగం కోసం తండ్రినే చంపాడు)

వెంటనే బెడ్‌షీట్‌ను లాగగా ఎముకల గూడు బయటపడింది. ఆ అస్తిపంజరం సదరు మతిస్థితిమితం లేని మహిళ తల్లి ఇవాన్‌ ఫెర్నాండజ్‌కు చెందినదిగా విచారణలో తేలింది. అస్తిపంజరాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. అయితే ఇవాన్‌ ఫెర్నాండజ్‌ ఎలా మరణించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top