కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన | Woman Innovative Protest Demanding Marriage With Her Boyfriend In Konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన

Published Wed, Jul 24 2024 6:34 PM | Last Updated on Wed, Jul 24 2024 7:55 PM

Woman Innovative Protest Demanding Marriage With Her Boyfriend In Konaseema

ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది.

సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement