విషాదం: బాత్రూంలోనే ప్రసవం.. | Woman Gives Birth In Bathroom Baby Dies In Vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

Dec 23 2020 1:55 PM | Updated on Dec 23 2020 2:20 PM

Woman Gives Birth In  Bathroom Baby Dies In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో  దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలైయ్యింది. వివరాల ప్రకారం..నిండు గర్భిణి ప్రసవం కోసం తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది.  అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేరని సిబ్బంది చెప్పారు. తీవ్ర పురిటినొప్పులతో ఆసుపత్రి బాత్రూంలోనే శిశివును ప్రసవించింది. సమయానికి చికిత్స అందకే శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement