Banjara Hills: భర్తను చున్నీతో హత్యచేసి.. ఆ త​ర్వాత | Wife Assasinate Her Husband In Hyderabad | Sakshi
Sakshi News home page

Banjara Hills: భర్తను చున్నీతో హత్యచేసి.. ఆ త​ర్వాత

Sep 16 2021 6:59 AM | Updated on Sep 16 2021 9:47 AM

Wife Assasinate Her Husband In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను చున్నీతో హత్య చేసి గుండెపోటులో చనిపోయాడంటూ చిత్రీకరించిందో మహా ఇల్లాలు. రెండు నెలల క్రితం జులై 16 ఈ సంఘటన జరిగింది. తాజాగా, నిందితురాలి కొడుకు తన తల్లి హత్య చేసిన విషయాన్ని అతని బాబాయ్‌ ప్రసాద్‌కి చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రసాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతుడు జగదీష్‌కు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే సుశ్రీతను 2007లో వివాహం చేసుకున్నాడు. జగదీష్‌ డ్రైవర్‌గా ఉద్యోగం చేసేవాడు. వీరు తమ 11 ఏళ్ల కొడుకుతో కలిసి ఫిలింనగర్‌లోని బంజారాహిల్స్‌లో కొన్నెళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం జులై16న సుశ్రీత భర్తను హాత్యచేసి గుండెపోటుతో చనిపోయాడంటూ ఇంట్లో వారిన నమ్మించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బాలుడు తన తల్లే.. తండ్రి జగదీష్‌ను హత్యచేసిందంటూ చెప్పడంతో ఈ అమానుషం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.   

చదవండి: దారుణ ఘటన.. ఒకే మర్రికి వెయ్యిమంది ఉరితీత...!

Advertisement
 
Advertisement
Advertisement