కీచక టిక్కెట్‌ కలెక్టర్‌..కదులుతున్న రైలులో మహిళపై...

Ticket Examiner Arrested Allegedly Gang Molested Woman At UP - Sakshi

ఒక కీచక టిక్కెట్‌ కలెక్టర్‌ రైలులో దారుణమైన అకృత్యానికి పాల్పడ్డాడు. కదులుతున​ రైలులో తన సహచరుడితో కలిసి మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌ జిల్లాలో జనవరి 16న చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జనవరి 16న ఒక మహిళ చందౌసి రైల్వే స్టేషన్‌లో వేచి ఉంది. నిందితుడు ట్రావెలింగ్‌ టిక్కెట్‌ ఎగ్జామినర్‌ ఆమెను ఏసీ కోచ్‌లో కూర్చొపెట్టాడు.

ఆమె చందౌసి నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని సుబేదర్‌గంజ్‌కు వెళ్లాల్సి ఉంది. ఐతే ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో చందౌసి టీటీఈ మరోక వ్యక్తి వచ్చి..ఆమెపై సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో ఆమె సంభాల్‌ జిల్లాలోని గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ) స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ రైలుకి సంబధించి పలు టీటీఈలను మహిళకు చూపించగా సదరు నిందితుడు టీటీఈని ఆమె గుర్తించింది. ఐతే మరొక వ్యక్తిని గుర్తించలేకపోయింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. మరొక నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

(చదవండి: గోహత్యపై గుజరాత్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top