దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు | Telangana High Court Sentenced The Convict To Death In The Girl Assassination Case | Sakshi
Sakshi News home page

HYD: బాలికపై హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

Jul 31 2024 6:32 PM | Updated on Jul 31 2024 7:05 PM

Telangana High Court Sentenced The Convict To Death In The Girl Assassination Case

నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది.

సాక్షి, హైదరాబాద్‌: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్‌కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.

2021లో దోషి దినేష్‌కుమార్‌కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.

Advertisement
 
Advertisement
Advertisement